యేసునాధా దేవా వందనాలు రాజా వందనాలు
రాజాధిరాజా నీకే వందనాలు
రవికోటి తేజ నీకే వందనాలు } 2 || యేసునాధా ||
పాపిని కరుణించి ప్రాణదానమిచ్ఛావు
పరమ జీవమిచ్చి పరలోకరాజ్యమిచ్చి } 2
పండ్రెండు గుమ్మముల పట్టణమే నాకు కట్టబెట్టినావా || రాజాధిరాజా ||
నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావు
నీ నీతి నాకిచ్ఛి నిత్య రాజ్యమిచ్చావు} 2
నీ నీతి నీ రాజ్యం నిండైన నా భాగ్యమే || రాజాధిరాజా ||
కన్నుమిన్ను కానకుండ నిన్ను వీడిపోయాను
చిన్నబుచ్చుకోకుండ నన్ను సమకూర్చావు} 2
నీ మనసే వెన్నయ్యా నాకన్న తండ్రి నా యేసయ్యా
యేసునాధా దేవా వందనాలు రాజా వందనాలు
రాజాధిరాజా నీకే వందనాలు
రవికోటి తేజ నీకే వందనాలు || రాజాధిరాజా ||
--Yesunaa