యేసుని కొరకై యిల జీవించెద భాసురముగ నే ననుదినము
దోసములన్నియు బాపెను మోక్ష ని వాసమున ప్రభు జేర్చునుగా ||యేసుని||
1. నాశనకరమగు గుంటలోనుండియు మోసకరంబగు యూబినుండి నాశచే
నిలపై కెత్తెను నన్ను పి శాచి పథంబున దొలగించెన్ ||యేసుని||
2. పలువిధముల పాపంబును జేసితి వలదని ద్రోసితి వాక్యమును కలుషము
బాపెను కరుణను బిలిచెను సిలువలో నన్నాకర్షించెను ||యేసుని||
3. అలయక సొలయక సాగిపోదును వెలయగ నా ప్రభు మార్గములన్
కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు ||యేసుని||
4. శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభువనిశం వ్యాధులు
లేములు మరణము వచ్చిన నాధుడే నా నిరీక్షణగున్ ||యేసుని||
5. బుద్ధి విజ్ఞా