యేసుని స్తుతించువారు – నిత్య జీవము

Telugu Christian Song

యేసుని స్తుతించువారు – నిత్య జీవము నొందెదరు ఆనందముతో అనుదినము – సంతోషముతో నుందురు ఆహా హల్లెలూయా-ఆహా హల్లెలూయా (2) 1.వాడబారని ఆకువలె – దినదినము బలమొందెదరు జీవజలపునది యొడ్డున – వృక్షములవలె పెరిగెదరు IIఆహాII 2.చీకటి నుండి వెలుగునకు – మరణము నుండి జీవముకు చేయి విడువడక తనతో కూడ – యేసే నడిపించునుIIఆహాII 3.చీకు చింతలు కలిగిననూ – చెరలో దుఃఖము కలిగినను కనురెప్పవలె కాపాడి – యేసే విడిపించును IIఆహాII 4.నడి సంద్రములో పయనించినా – నట్టడవులలో నివసించినా ఎన్నడు విడువక మరువకను యేసే తోడుండును IIఆహాII --Yesuni sthuthinchuvaaru nithya jeevamu--
Telugu