యేసును చూచుట యెన్నటికో పర వాసుఁడ

Telugu Christian Song

యేసును చూచుట యెన్నటికో పర వాసుఁడ నగుట యెన్నటికో భాసురముగ నా పరమ జనకు సిం హాసనమున దూ తాదుల మధ్యను ||యేసును|| 1. బలితంబగు పైశాచక బంధన పాశము వదులుట యెన్నటికో సలలి తముగ నా సద్గురు పాద స్థలమున కరఁగుట యెన్నటికో ||యేసును|| 2. ధాత్రిఁ గష్ట దుఃఖాబ్ధిని మన మిఁక ధాటిగ దాఁటుట యెన్నటికో మైత్రితోడఁ బర మాత్ముని చెంతను మనసు తీర మను టెన్నటికో ||యేసును|| 3. కాంచనమకుటము కనకపు వీణెయు ఘనముగఁ దాల్చుట యెన్న టికో యంచితముగ హలె లూయా పాటల నానందించుట యెన్నటికో ||యేసును|| 4. శోధన బాధల నీ ధరఁ బొందక శోకము గెల్చుట యెన్నటికో సాధూత్తమ జన సాంగత్యమ్మున సంతస మొందుట యెన్నటికో ||యేసును|| 5. నీతి రహిత పైశాచిక భటగణ నిందలు బాయుట
Telugu
8 views