యేసు రాజా నీకే ఈ స్తుతి

Telugu Christian Song

యేసు రాజా నీకే ఈ స్తుతి ఆరాధన నా యేసు రాజా నీకే నా స్తుతి సంకీర్తన ఆరాధన స్తుతి ఆరాధన సంకీర్తన స్తుతి స్తోత్రార్పణ (2) ||యేసు|| నీ మాటలో కరుణ నీ చూపులో ఆదరణ నీ ప్రేమలో రక్షణ నీ కుడి చేతిలో దీవెన (2) నీతోనే నిత్యానుబంధము నీవే నా జీవిత గమ్యము (2) ||ఆరాధన|| జలములలో నే వెళ్లినా అగ్నిలో నడిచినా సుడి గాలులే ఎదురైనా పెను తుఫానే చెలరేగినా (2) నీ నామమే నను ధైర్యపరచును నీ మాటలే నన్నాదరించును (2) ||ఆరాధన|| --Yesu raaja neeke ee sthuthi--
Telugu