యేసుతో ఠీవిగాను పోదమా

Telugu Christian Song

యేసుతో ఠీవిగాను పోదమా! అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోదము ||యేసుతో|| 1. రారాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవచేయను యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| 2. విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు అనుదినంబు శక్తిని బొందుచున్నవారమై యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| 3. శోధనలు మనల చుట్టివచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| 4. ఓ యువతి యువకులారా చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి లోకమంత యేకమై యేసునాధు గొల్వను సాధనంబెవరు నీవు నేనెగా ||యేసుతో|| --Yesutho teeviganu podam
Telugu